వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లిలో బిర్యానీ సెంటర్ పై దాడికి పాల్పడిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కిష్టారానికి చెందిన పలగాని ఉపేందర్ సత్తుపల్లిలోని ఓ బిర్యాని సెంటర్ లో రూ.200 ఫోన్ పే చేసి 4 చికెన్ లెగ్ పీసులు తీసుకుని ఇంటికి వెళ్లాడు.
ఒకటి కుళ్లిన వాసన రావడంతో ఉపేందర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకుడిపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

