Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తనపల్లి జాబ్ మేళాలో 51 మందికి ఉద్యోగ అవకాశాలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 10:04 PM పల్నాడుGeneral
సత్తనపల్లి జాబ్ మేళాలో 51 మందికి ఉద్యోగ అవకాశాలు - Udayam
సత్తనపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు 128 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారని కాలేజీ ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 11 కంపెనీల వారు పాల్గొనగా అర్హత కలిగిన 51 మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు దక్కాయని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డిపార్టు మెంట్ వారు తమ కాలేజీలో ఈ జాబ్ మేళా నిర్వహించడం ఎంతో విశేషం అన్నారు .

Comments

G
Loading comments...