వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలు పట్టణం మార్కండేయపురం రావిచెట్టు వద్ద ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లికి విజయదశమి సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మంగళవారం బోనాలతో పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

