వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. గుంపులుగా సంచరిస్తూ ప్రజలు, పశువులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల సిద్దిపేటతో పాటు పలు మండలాల్లో కుక్కల దాడులు పెరిగాయి.
రాయపోల్ మండలం అనాజీపూర్‌లో కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతిచెందాయి. మిట్టపల్లి, చౌదరిపల్లిలోనూ దాడులు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

