Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో వింత చోరీ

Follow Udayam on Google
Ravi Shukla Jun 10, 2026 11:05 AM నిజామాబాద్General
నిజామాబాద్‌లో వింత చోరీ - Udayam
నిజామాబాద్‌లోని విశ్రాంత జాయింట్‌ కలెక్టర్‌ రవికుమార్ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు, లాకర్‌ను తెరవలేక దాన్ని ఎత్తుకెళ్లారు. సాక్ష్యాలు దొరకకుండా సీసీ కెమెరాల డీవీఆర్‌ను కూడా తీసుకెళ్లడం గమనార్హం. స్థానికంగా ఉన్న బైకును దొంగిలించి, దానిపైనే లాకర్‌తో దుండగులు పరారయ్యారు. ఇందులో 25 తులాల బంగారం, నగదు ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...