Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి యోగా విజేతగా కానిస్టేబుల్ చలపతి.. ఎస్పీ ప్రశంస

శివ కుమార్ Jun 23, 2026 1:50 AM అనంతపురం 11 viewsabout 2 hours ago
రాష్ట్ర స్థాయి యోగా విజేతగా కానిస్టేబుల్ చలపతి.. ఎస్పీ ప్రశంస - Udayam Digital
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 'యోగాంధ్ర-2026' పోటీల్లో అనంతపురం జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎం. చలపతి రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన కనబరిచిన ప్రతిభను జిల్లా ఎస్పీ పి. జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చలపతి ప్రదర్శించిన యోగాసనాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ విజయం తోటి సిబ్బందికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ కొనియాడారు.

Comments

G
Loading comments...