Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యానశాఖలో సిబ్బంది కొరత.. రైతులకు ఇబ్బందులు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 10:41 AM నల్గొండతెలంగాణ
ఉద్యానశాఖలో సిబ్బంది కొరత.. రైతులకు ఇబ్బందులు - Udayam
ఉద్యానశాఖలో ఏళ్లుగా నియామకాలు లేకపోవడంతో రైతులకు సకాలంలో సేవలు అందడం లేదు. ఉమ్మడి నల్గొండలో 36 మంది హెచ్‌ఓలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 14 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కో అధికారికి 5 నుంచి 8 మండలాల బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణ కష్టంగా మారడంతో పంటలకు తెగుళ్లు సోకినప్పుడు రైతులకు సకాలంలో సలహాలు అందడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు. పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...