Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీ కాలువ మట్టి లూటీ

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 21, 2026 7:40 AM కరీంనగర్General
ఎస్సారెస్పీ కాలువ మట్టి లూటీ - Udayam
రామడుగు మండలం షానగర్‌లోని ఎస్సారెస్పీ వరద కాలువ మట్టి పట్టపగలే అక్రమంగా తరలిపోతోంది. పొక్లెయిన్లు, టిప్పర్లతో నిరాటంకంగా మట్టిని తోడేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. 2019 నుండి కొనసాగుతున్న ఈ లూటీ వల్ల కాలువ గట్లపై మట్టి ఖాళీ అవుతోంది. షానగర్‌ నుంచి కరీంనగర్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నా తహసీల్దార్ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...