Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెలాఖరుకు శ్రీశైలం 4వ యూనిట్

రూపేష్ గౌడ్ Jul 18, 2026 8:34 AM మహబూబ్‌నగర్about 1 hour ago
నెలాఖరుకు శ్రీశైలం 4వ యూనిట్ - Udayam Digital
ప్రమాదం జరిగిన ఆరేళ్ల తర్వాత శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రంలోని 4వ యూనిట్‌ను ఈ నెలాఖరు కల్లా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో రెండుసార్లు మరమ్మతులు చేసినా సాంకేతిక లోపాలతో ఈ 150 మెగావాట్ల యూనిట్ నిలిచిపోయింది. ప్రస్తుతం జెన్‌కో ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు చివరి దశకు చేరాయి. ఆగస్టు నాటికి డ్యామ్‌లోకి నీరొస్తే విద్యుత్తు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...