Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్‌ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు నిర్వహించారు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 19, 2026 7:51 AM ఆదిలాబాద్General
సర్దార్‌ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు నిర్వహించారు - Udayam
సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 376వ జయంతిని పురస్కరించుకుని బస్‌స్టాండ్‌ ఎదురుగా వేడుకలు నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాపన్న చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల ఆత్మగౌరవం, సమానత్వం కోసం పాపన్న చేసిన పోరాటం చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...