వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ అన్నారు.
ఆదివారం చిత్తూరు కలెక్టరేట్‌లో లచ్చన్న జయంతి వేడుకలు నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యలపై పోరాడిన లచ్చన్న బడుగు, బలహీన వర్గాలకు దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కృష్ణమూర్తి, బుస నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

