Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక సాంకేతికతతో దర్యాప్తు వేగవంతం చేయాలి: డీఎస్పీ

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:45 AM పశ్చిమగోదావరి General
ఆధునిక సాంకేతికతతో దర్యాప్తు వేగవంతం చేయాలి: డీఎస్పీ - Udayam
నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి కేసుల దర్యాప్తును వేగంగా పూర్తిచేయాలని డీఎస్పీ కె.జయకృష్ణ సూచించారు. పోలవరంలో శుక్రవారం పోలీసు సిబ్బందికి నేర పరిశోధనపై శిక్షణ ఇచ్చారు. నేరస్థలాన్ని పరిశీలించడం, ఫొటోలు తీయడం, భౌతిక ఆధారాలను శాస్త్రీయంగా సేకరించి భద్రపరచడంపై అవగాహన కల్పించారు. సిబ్బంది సమయపాలన, క్రమశిక్షణ పాటించాలన్నారు.

Comments

G
Loading comments...