Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలసిరి పనులు వేగవంతం చేయాలి

Follow Udayam on Google
రచన దేవి Jul 28, 2026 5:59 PM సూర్యాపేటGeneral
జలసిరి పనులు వేగవంతం చేయాలి - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బి. హరిసింగ్ అధికారులను ఆదేశించారు. నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంకుడు గుంతలు, పంటకుంటలు, బోరు రీఛార్జ్ పనులు చేపట్టాలని చెప్పారు. అనంతరం భూభారతి, ఓటరు జాబితా సవరణ, పెండింగ్ భూ సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...