Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతివేగం, డ్రంక్ డ్రైవింగ్ వద్దు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:14 PM యాదాద్రి భువనగిరిGeneral
అతివేగం, డ్రంక్ డ్రైవింగ్ వద్దు - Udayam
చౌటుప్పల్‌ పోలీసుల ఆధ్వర్యంలో మల్కాపూర్‌ పరిధిలోని శ్రీ జయ ల్యాబ్స్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఇన్‌స్పెక్టర్‌ జి. మన్మథకుమార్‌ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కార్లలో సీట్‌బెల్ట్‌ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...