వార్తలకు తిరిగి వెళ్లండి
కాశీ, అయోధ్యకు ప్రత్యేక రైలు

ఎన్నికల హామీ మేరకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తన సొంత నిధులతో 1,500 మందిని కాశీ, అయోధ్య యాత్రకు ప్రత్యేక రైలులో పంపించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో ఎంపీ స్వయంగా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
ఐదు రోజుల పాటు సాగే ఈ ఉచిత ప్రయాణంలో యాత్రికులకు వైద్య బృందం, వాలంటీర్ల సేవలు అందుతాయి. త్వరలోనే రెండో విడతలో మరో 1,500 మందికి యాత్రా అవకాశం కల్పిస్తామని ఎంపీ వెల్లడించారు.
Comments
Loading comments...