Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు క్లాసుల కంటే పిల్లలతో మాట్లాడండి: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 10:52 AM జాతీయంGeneral
అదనపు క్లాసుల కంటే పిల్లలతో మాట్లాడండి: సుప్రీంకోర్టు - Udayam
అదనపు క్లాసులకు పంపించే బదులు కొంత సమయం కేటాయించి పిల్లలతో మాట్లాడాలని సుప్రీంకోర్టు తల్లిదండ్రులకు సూచించింది. జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌ల ధర్మాసనం గురువారం ఈ సూచన చేసింది. ఇతరులతో ఎలా మెలగాలో, ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలతో అబ్బాయిలు ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులు నేర్పాలని పేర్కొంది. రకరకాల తరగతులు పిల్లలకు మంచివి కావని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...