వార్తలకు తిరిగి వెళ్లండి

సోమూర్ శివారులో చేపడుతున్న పంట చేనుల రీసర్వే పనులను బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. సర్వే నక్ష అందుబాటులో లేకపోవడంతో రీసర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
సర్వేయర్లు పకడ్బందీగా పనులు చేపట్టాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడి రీసర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎండీ ముజీబ్, సర్వేయర్ వెంకట్, జూనియర్ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు.
Comments
Loading comments...

