Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత ఖర్చులతో కాలువకు మరమ్మతులు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:16 AM ఆసిఫాబాద్General
సొంత ఖర్చులతో కాలువకు మరమ్మతులు - Udayam
పెంచికల్పేట్‌ బొక్కివాగు ప్రాజెక్టు ఎడమ కాలువకు రైతులు సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టారు. కాలువకు గండిపడటంతో సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు రూ.40 వేలు సమకూర్చుకుని జేసీబీ, ట్రాక్టర్లతో పూడిక తొలగించారు. సిమెంట్‌ పైపులు, ఇటుకలతో మరమ్మతులు చేయడంతో 300 ఎకరాల పంటలకు నీరు చేరింది. ఏటా కాలువలు దెబ్బతింటున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...