Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలో గల్లంతైన యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 9:43 AM పశ్చిమగోదావరి General
కాలువలో గల్లంతైన యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు - Udayam
ఇరగవరం మండలం అయితంపూడి వద్ద నరసాపురం కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన చెరుకూరి రాజారామ్‌చరణ్‌ ఆచూకీ రెండు రోజులు గడిచినా లభించలేదు. మిగిలిన నలుగురి మృతదేహాలు ఆదివారమే లభించాయి. రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది డ్రోన్లతో గాలిస్తున్నారు. కుమారుడి జాడ కోసం తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్ద కన్నీటితో నిరీక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...