Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతికతతో చోరీ కేసు ఛేదన

Follow Udayam on Google
రాజిత దేవి Jul 11, 2026 9:02 AM అనంతపురంGeneral
సాంకేతికతతో చోరీ కేసు ఛేదన - Udayam
ఆర్టీజీఎస్‌ 360 సాంకేతికత సహాయంతో ద్విచక్ర వాహనం చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించినట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ తెలిపారు. కొక్కంటిక్రాస్‌ వద్ద వాహనాన్ని ఎత్తుకెళ్లిన నిందితుడు వెంకటరావును ఏర్పేడు వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోర్టల్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమాచారం చేరవేసి, పోలీసుల సమన్వయంతో వాహనంతో సహా నిందితుడిని టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Comments

G
Loading comments...