Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణానదికి గోదావరి జలాలు

పార్వతి దేవి Jul 11, 2026 5:36 AM అమరావతి 1 viewsabout 1 hour ago
గోదావరి జలాలు శుక్రవారం నాటికి కృష్ణానదిలో చేరుతాయని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మూడు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న పట్టిసీమ మోటార్లను అధికారులు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం 20 మోటార్ల ద్వారా రోజుకు 7 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు 1.33 టీఎంసీల జలాలను పోలవరం కుడికాలువకు విజయవంతంగా మళ్లించారు.

Comments

G
Loading comments...