Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్‌ సమస్యలు పరిష్కరించాలి: సీపీఎం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 03, 2026 3:32 PM ఆదిలాబాద్General
రిమ్స్‌ సమస్యలు పరిష్కరించాలి: సీపీఎం - Udayam
ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్‌ కోరారు. ఆసుపత్రిని సందర్శించి రోగులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రిమ్స్‌లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలో గుర్తించిన సమస్యలపై అధ్యయనం చేసి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రికి నివేదిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...