Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 10:06 AM శ్రీకాకుళంGeneral
సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి - Udayam
మందస మండలం దున్నూరు పంచాయతీ గడ్డూరు గ్రామానికి చెందిన వంక యాదవరావు (55) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. మంగళవారం ఉదయం ముగ్గురు మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్లగా అలల ధాటికి తెప్ప బోల్తా పడింది. నలుగురు సముద్రంలో పడిపోగా ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. యాదవరావు తెప్ప కింద చిక్కుకుని ఊపిరాడక అపస్మారక స్థితికి చేరి మరణించాడు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...