వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీపై విద్యుత్ దీపాలు వెలగక అంధకారం అలుముకుంది. గతంలో విద్యుత్ దీపాల కాంతులతో రాత్రివేళ బ్యారేజీ కనువిందు చేసేది.
ప్రస్తుతం సగానికి పైగా దీపాలు పనిచేయకపోవడంతో పొద్దుగూకిందంటే బ్యారేజీ పరిసరాలు చీకటిమయంగా మారుతున్నాయి. అధికారులు స్పందించి దీపాలకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

