వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మండలం సలాబత్పూర్ ఆలయానికి నిత్యం వందలాది భక్తులు వస్తుండగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నామమాత్రంగా నీటి ట్యాంకు ఏర్పాటు చేశారని భక్తులు ఆరోపించారు. కాళ్లు కడుక్కోవడానికి, తాగేందుకు ఒకే ట్యాంకు ఉండటంతో నీటి కొరత ఏర్పడుతోందన్నారు.
ఆలయానికి రూ.లక్షల ఆదాయం వస్తున్నా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

