Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కేట్‌ గేమ్స్‌లో చరితశ్రీ బృందానికి కాంస్యం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 10:44 AM జాతీయంక్రీడలు
స్కేట్‌ గేమ్స్‌లో చరితశ్రీ బృందానికి కాంస్యం - Udayam
పరాగ్వేలో జరుగుతున్న వరల్డ్‌ స్కేట్‌ గేమ్స్‌లో హైదరాబాద్‌ అమ్మాయి మండెపూడి చరితశ్రీ బృందం కాంస్య పతకం సాధించింది. జూనియర్‌ మహిళల 3,000 మీటర్ల రిలే రేసును 4 నిమిషాల 34.659 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. చరితశ్రీ, రుత్వా ప్రకాశ్‌, ప్రగతి శివబాలన్‌, లక్షిత సింధు జట్టుగా బరిలోకి దిగారు. 15 ఏళ్ల చరితశ్రీ ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 18 స్వర్ణాలు గెలిచింది.

Comments

G
Loading comments...