వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు జరగనుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువకులు భారీగా తరలివస్తున్నారు. పట్టణంలో మొత్తం 2,500 మంది యువ ఓటర్లు ఉన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

