వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్ ఉన్నత పాఠశాలలో 70వ ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఇన్‌చార్జ్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయాలని సూచించారు. అనంతరం తెలంగాణ భాష ప్రాముఖ్యత, కాళోజీ నారాయణరావు పోరాటాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంఈవో నాగారం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

