వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్కల్ మండలంలోని ఎం.భాగారెడ్డి సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద నీరు చేరుతోంది. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి 923 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
ప్రస్తుతం ప్రాజెక్టులో 515.460 మీటర్ల నీటిమట్టం, 4.564 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, పూర్తి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు.
Comments
Loading comments...

