Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి సమస్యలపై ఏఐటీయూసీ నిరాహార దీక్షలు

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 2:45 PM జయ శంకర్ భూపాలపల్లి General
సింగరేణి సమస్యలపై ఏఐటీయూసీ నిరాహార దీక్షలు - Udayam
భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని, మెడికల్ బోర్డులు నిర్వహించి అర్హులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. పెండింగ్ వీవీటీసీ ఆర్డర్లు నెల రోజుల్లో జారీ చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...