Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫ్లాట్లు దగ్ధం

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 2:57 PM హైదరాబాద్General
అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫ్లాట్లు దగ్ధం - Udayam
కుత్బుల్లాపూర్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్ కాలనీలో అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులోని 404వ ఫ్లాట్‌లో గ్యాస్ సిలిండర్లు, ఏసీ కంప్రెసర్లు పేలడంతో మంటలు పక్కనున్న మరో ఫ్లాట్‌కు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రెండు ఫ్లాట్లలోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Comments

G
Loading comments...