Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింగరేణి కార్మికుల ఖాతాల్లో రేపు బోనస్ జమ

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 10:10 AM హైదరాబాద్General
సింగరేణి కార్మికుల ఖాతాల్లో రేపు బోనస్ జమ - Udayam
సింగరేణి కార్మికుల బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం (అక్టోబర్ 16) రూ.596.36 కోట్ల బోనస్ జమ కానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆర్జించిన రూ.1,754 కోట్ల లాభాల్లో 34 శాతం వాటాగా ఈ బోనస్ చెల్లించనున్నారు. 38,737 మంది పర్మినెంట్ కార్మికులకు సగటున రూ.1,53,912, 29,717 మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 చొప్పున అందనుంది. పర్మినెంట్ కార్మికులకు హాజరు, పని చేసే విభాగం ఆధారంగా బోనస్ లెక్కిస్తారు.

Comments

G
Loading comments...