వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయగిరిలో దస్తావేజు లేఖరులు ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు.
ఈ జీవో వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని, ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని దస్తావేజు లేఖరులు పేర్కొన్నారు. జీవోను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...
