వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ (జి) మండలం గొల్లమడ గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్నదాన వేడుకల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు స్వస్తి పలికారు.
వాటి స్థానంలో పూర్తిగా స్టీల్ పాత్రలను వినియోగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంధ్య రెడ్డి చొరవతో ఈ మార్పు సాధ్యమైంది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు, స్థానికులు అభినందిస్తున్నారు.
Comments
Loading comments...

