వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామికి పి.గన్నవరం వాసులు నందపునీడి గణేశ్, భూలక్ష్మి దంపతులు వెండి కానుకలు సమర్పించారు. సుమారు 468 గ్రాముల బరువైన రూ.1,19,340 విలువైన వెండి శఠగోపురం, పళ్లాన్ని స్వామివారికి బహూకరించారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
Comments
Loading comments...

