Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎం డిమాండ్: లక్డారం గ్రామంలో ఎస్టీపీ ప్లాంట్‌ను విరమించాలి

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 19, 2026 7:28 PM సంగారెడ్డిGeneral
సీపీఎం డిమాండ్: లక్డారం గ్రామంలో ఎస్టీపీ ప్లాంట్‌ను విరమించాలి - Udayam
పటాన్‌చెరు లక్డారం గ్రామ దళితుల భూముల్లో ఎస్టీపీ ప్లాంట్‌ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.జయరాజ్‌ డిమాండ్‌ చేశారు. రైతుల సాగు భూములను పరిశీలించిన సీపీఎం బృందం అనంతరం తహసీల్దార్‌ హరిబాబుకు వినతిపత్రం అందజేసింది. భూములు తీసుకుంటే భూమికి భూమి లేదా తగిన నష్టపరిహారం ఇవ్వాలని‌ కోరారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా పోలీసు బందోబస్తులో ఫెన్సింగ్‌ పనులు చేపట్టడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...