వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ న్యాయవాది, దళిత బహుజన ఉద్యమకారుడు కూర్మాచలం ఉమా మహేష్ సీపీఐ(ఎం)లో చేరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి లెల్లెల బాలకృష్ణ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు.
ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తానని ఉమా మహేష్ తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన పాల్గొన్నారు.
Comments
Loading comments...

