Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

Follow Udayam on Google
Mohammad Sep 11, 2026 3:26 PM అనంతపురంGeneral
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత - Udayam
అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు రూ. 20.39 లక్షల విలువైన CMRF చెక్కులను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం పంపిణీ చేశారు. అనంత రూరల్‌లో 20 మందికి, ఆత్మకూరులో ఐదుగురికి, కనగానపల్లిలో ఏడుగురికి, సీకే పల్లిలో ఐదుగురికి ఈ చెక్కులు అందించారు. సీఎం సహాయనిది పేదలకు ఒక వరమని ఆమె తెలిపారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...