Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీడీసీ ఛైర్మన్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి

Follow Udayam on Google
K.Venkatesh Sep 03, 2026 4:31 PM ఖమ్మంGeneral
సీడీసీ ఛైర్మన్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి - Udayam
కూసుమంచి మండలంలోని ఈశ్వరమాదారం గ్రామానికి చెందిన సీడీసీ చైర్మన్ యరబోలు సూర్యనారాయణరెడ్డి ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...