Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏజెన్సీలో సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలు

Follow Udayam on Google
Vikram Jun 11, 2026 11:42 AM ఖమ్మంGeneral
ఏజెన్సీలో సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలు - Udayam
భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో సికిల్‌సెల్ ఎనీమియా, థలసీమియా వ్యాధులను అరికట్టేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. భద్రాచలం, పాల్వంచ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇస్తున్నారు. జన్యుపరంగా సంక్రమించే ఈ ప్రమాదకర వ్యాధిని ముందే గుర్తించేందుకు గర్భిణులతో పాటు నవజాత శిశువులకు కూడా పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో 214 మంది బాధితులను గుర్తించగా, కొత్త కేసుల కోసం తనిఖీలు వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...