వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాసలోని సహస్ర లింగాల దేవాలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ముగ్గురు అమ్మవార్లతో పాటు శివయ్యకు పంచామృత అభిషేకం, అష్టోత్తర నామావళితో పూజలు నిర్వహించారు.
భక్తుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు, మహిళలకు పసుపు, కుంకుమ అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

