Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం తీర భద్రతకు మెరైన్ కంట్రోల్ రూం

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 4:44 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం తీర భద్రతకు మెరైన్ కంట్రోల్ రూం - Udayam
జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసేందుకు మెరైన్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 193 కి.మీ. తీరప్రాంతంలో 11 మండలాలు, 142 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. మెరైన్ పోలీస్ స్టేషన్లకు మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్ కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...