వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రిమ్స్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులు, పారామెడికల్ సిబ్బంది బుధవారం ఫ్లకార్డులతో ఒంటి కాలిపై నిల్చోని నిరసన తెలిపారు.
ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరించే వరకు 100% గ్రాస్ శాలరీ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

