వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని గూనపాలెం డీఎస్పీ కార్యాలయంలో సీహెచ్. ధనుంజయ నాయుడు సోమవారం బాధ్యతలు చేపట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

