వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
మెట్లపై నుంచి పడ్డాడని యాజమాన్యం తెలిపిందని, ర్యాగింగ్ పేరుతో దాడి చేశారని బాధితుడు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

