Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం చివరి శనివారం ఘనంగా పెద్ద మంగళ ఆంజనేయస్వామి రథోత్సవం

Follow Udayam on Google
H M G H Q Sep 05, 2026 1:10 PM కర్నూలుGeneral
శ్రావణమాసం చివరి శనివారం ఘనంగా పెద్ద మంగళ ఆంజనేయస్వామి రథోత్సవం - Udayam
పత్తికొండ తేరుబజారులోని పెద్ద మంగళ ఆంజనేయస్వామి రథోత్సవాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు అభిషేకాలు, పూజలు చేశారు. అలంకరించిన రథంపై స్వామివారిని ప్రతిష్ఠించి అంబేద్కర్ సర్కిల్, గుత్తి రోడ్డులోని వడ్డేవారి కట్ట వరకు గ్రామోత్సవం నిర్వహించారు. మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, కేడీసీసీ బ్యాంకు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. రామచంద్రారెడ్డి దంపతులు రథాన్ని లాగారు. అనంతరం అన్నదానం చేశారు.

Comments

G
Loading comments...