Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 60 శాతం పూర్తైన వనమహోత్సవం

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 6:08 PM వనపర్తితెలంగాణ
జిల్లాలో 60 శాతం పూర్తైన వనమహోత్సవం - Udayam
వనమహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి వనమహోత్సవం, పంట మార్పిడి, పింఛన్ల దరఖాస్తులపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు వనమహోత్సవం లక్ష్యంలో 60 శాతం పూర్తయిందని అదనపు కలెక్టర్‌ తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...