వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం తాళంగూడ, ఇప్పమానుగూడ గ్రామాలకు వెళ్లే 800 మీటర్ల రహదారి శిథిలావస్థకు చేరింది. సీసీ రోడ్డు దెబ్బతిని రాళ్లు తేలడంతో పాటు గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
వర్షాలకు రోడ్డు మరింత అధ్వానంగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

