Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థకు చేరిన బీఎస్ఎన్ఎల్ భవనం

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 11:09 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని స్థానికులు పేర్కొన్నారు. గతంలో బీఎస్ఎన్ఎల్ బిల్లుల చెల్లింపు కేంద్రంతో పాటు ఆధార్ సెంటర్ ఇక్కడ నిర్వహించేవారు. ప్రస్తుతం భవనం నిరుపయోగంగా మారడంతో ప్రాంగణమంతా పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. పట్టణ నడిబొడ్డున ఉన్న శిథిల భవనాన్ని నేలమట్టం చేసి, ఆ స్థానంలో నూతన భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...