వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం ఊర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని తొలగించేందుకు అనుమతులు మంజూరు చేయాలని హెచ్‌ఎం డి. భారతి కోరారు.
బుధవారం సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావుకు లేఖ అందజేశారు. శిథిల భవనంతో విద్యార్థులు ఆయా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి, భవనం తొలగింపునకు చర్యలు చేపట్టాలని ఆమె కోరారు
Comments
Loading comments...

